సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు
ఇచ్చాపురం : సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియ విజయ్ సాయిరాజ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనారిటీ వర్గాల పేదింటి వారికి కల్యాణమస్తు మేలైన పథకమన్నారు. ఈ పథకానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బాల్య వివాహాలు అరికట్టడంతో పాటు విద్యను ప్రోత్సహించడం, అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం వధూవరులు కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన హర్షణీయమన్నారు.