యువతి అదృశ్యంపై కేసు నమోదు
న్యూస్ వన్ టీవీ, పెందుర్తి: 17వ వార్డు పరిధి లంకెలపాలేనికి చెందిన యువతి అదృశ్యంపై గురువారం రాత్రి కేసు నమోదు చేశామని పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపారు. గ్రామానికి చెందిన యువతి(18) ఈనెల 14వ రాత్రి 11 గంటల సమయంలో ఇంటినుంచి వెళ్లిపోయి మరలా తిరిగి రాలేదన్నారు. పరిసర ప్రాంతాలతో పాటు బందువుల ఇళ్ల వద్ద 20కినా ఆచూకి తెలియరాలేదన్నారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.