చిన్నారిపై కుక్కల దాడి.. నోరు, చెవికి తీవ్ర గాయాలు..
న్యూస్ వన్ టీవీ, హైదరాబాద్ :- హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రాజధానిలో ఎక్కడో ఓ చోట ప్రతీరోజు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఎవరినో ఒక్కరిని గాయపరుస్తూనే ఉన్నాయి. తాజాగా రామంతపూర్ రాంరెడ్డి నగర్‌లో ఓ పాపపై కుక్కలు విరుచుకుపడ్డాయి. మూడేళ్ల చిన్నారి కృత్తికపై దాడి చేశాయి.
స్కూలుకు వెళ్లొచ్చి ఇంటి బయట ఆడుకుంటుండగా ఎటాక్ చేశాయి. ఈ ఘటనలో పాప నోరు, చెవి భాగాన్న తీవ్ర గాయాలయ్యాయి. బాధిత చిన్నారిని చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కృత్తిక పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు.