సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
విజయనగరం : విజయనగరం పట్టణంలోని 23వ డివిజన్ పరిధిలో బొండాడ వీధిలో రూ. 31లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మీ, స్థానిక నేతలు పాల్గొన్నారు.