బాపట్లలో కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కొత్తవేరియంట్ కేసులు
న్యూస్ వన్ టీవీ, జాతీయం :- దేశవ్యప్తంగా కొత్త కరోనా వేరియంట్ జేఎన్-1 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా వేరియంట్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే చెన్నైలో కరోనా జేఎన్-1 వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం చెన్నైలో కరోనా బాధితుల సంఖ్య 82కు చేరింది.
వివిధ ఆసుపత్రుల్లో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లిన సమయంలో మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ ఆధికారులు సూచించారు. కరోనా లక్షణాలున్న వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. బాపట్ల జిల్లా కొరిశపాడులో కూడా కరోనా కలకలం రేపుతోంది. గత వారం శబరిమల నుంచి తిరిగి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. వీరితో పాటు ఒకే బస్సులో మరో 30 మంది ప్రయాణించారని సమాచారం. ఒకే ఊరిలో 6 కరోనా కేసులు రావవడంతో.. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.