మరో 16 లక్షల టెస్లా కార్లు వెనక్కి..
న్యూస్ వన్ టీవీ, అంతర్జాతీయం :- టెస్లా ఖాతాలో మరో రీకాల్. నెల గడవక ముందే 16 లక్షల కార్లను వెనక్కి రప్పించుకుంటోంది. ఇవన్నీ చైనాకు పంపినవే. మోడల్ ఎస్, ఎక్స్, 3, వై ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో ఉన్నాయి. ఆటో పైలెట్ సిస్టమ్‌లోని లోపాలను సరిచేసేందుకు గత నెలలో 20 లక్షల కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా డోర్ లాచ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ అసిస్టెడ్ స్టీరింగ్ ఫంక్షన్లలో లోపాల కారణంగా చైనా దిగుమతి చేసుకున్న ఆయా మోడళ్ల కార్లను టెస్లా రీకాల్ చేసింది. 2022-23 మధ్య తయారైన కార్లలో ఈ లోపాలు ఎక్కువగా ఉన్నట్టు బీజింగ్‌లోని టెస్లా మోటార్స్ చెబుతోంది.
ఆటోపైలెట్ సిస్టమ్ లోపభూయిష్టంగా ఉన్నట్టు అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. రెండేళ్ల అధ్యయనం అనంతరం అధికారులు ఆటోపైలట్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ మేరకు తాజాగా చైనాకు పంపిన కార్లను వెనక్కి రప్పిస్తున్నారు.